బోధిధర్ముని నిజ జీవిత వివరాలివి

చైనాలో ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం, బోధిధర్ముడు కంచి నుంచి పాలించిన పల్లవ రాజు మూడో కొడుకు బోధిధర్ముని అసలు పేరు బోధితార క్షత్రియ మహాకాశ్యప పరంపరకు చెందిన ప్రజ్ఞా తార ఆయన గురువు. ఒకసారి ప్రజాతారుడు కాంచీపురానికి వచ్చి నపుడు, పల్లవరాజు ఆయన్ను స్వయంగా లోపలికి ఆహ్వానించి, ఒక రత్నాన్ని బహూకరించాడు. వెంటనే ఆ బౌద్ధ చార్యుడు, రాజు ముగ్గురు కొడుకులను పిలిచి ఈ రత్నపూ కాంతితో పోల్చదగిన ది ఏదైనా ఉందా అని అడిగాడు. 


మొదటి ఇద్దరు సరైన సమాధానం చెప్పలేకపోతారు, మూడో వాడైన బోదితారుడు ఆచార్యా ఈ రత్నం ఇహలోకపు నిధి మాత్రమే, అత్యున్నతమైనది చెప్పే గుణం ఇందులో ఏ మాత్రం లేదు. దాని నుండి వెలువడే కాంతి కంటే బోధిమండలం వెదజల్లే కాంతే అత్యుత్తమమైనది" అని చెప్పాడు. ఈ సమాధానంతో బోధితారుడు ధార్మికోన్నత ప్రగతి సాధించగలడన్న నమ్మకం ప్రజ్ఞాతారునికి కుదిరింది. ఆ తర్వాత పల్లవ రాజుల అనుమతితో బోధితారుడు ఇల్లు వదిలి, ప్రజా తుని దగ్గర శిక్షణ పొంది కాంచి పురం నుంచి చైనా వెళ్ళాడు. క్రీ.శ. 400-460 మధ్య కాలంలో బుద్ధ భద్రాచార్యుడు ఉత్తరదేశం నుంచి భూమార్గం ద్వారా, గుణ భద్రాచలం ర్యుడు దక్షిణ భారతదేశం నుంచి సముద్రమార్గం ద్వారా చైనా చేరు కుని బుద్ధధర్మాన్ని ప్రవర్తింపజేశారు. వారు పరినిర్వాణం చెందిన తరువాత చైనాలో బుద్ధధర్మాన్ని బోధించే వారు లేరని తెలుసుకుని బోధి ధర్ముడు, తండ్రి చైనా కెళ్ళాలి తలంపును వెల్లడించాడు. రాజు అంగీకరించాడు. కంచి నుంచి రేవు పట్టణం వరకూ రాజు పరి వారం తో వెళ్ళి ఒక పడవను ఏర్పాటు చేసి వీడ్కోలు చెప్పినపుడు అందరూ కన్నీటి పర్యంతమైనారు. సుదీర్ఘ సముద్రయానం తరు వాత బోధిధర్ముడు క్రీ.శ. 520లో దక్షిణ చైనాలోని గాంగ్టూ చేరుకున్నాడు

తర్వాత యాంగ్జియాంగ్ నదిని దాటి ఉత్తర చైనా చేరుకున్నాడు యాంగ్ రింగ్ ఆరామానికి చేరుకుని, రమణీయమైన ప్రకృతి నడుమ ఉన్న పగో డాలను చూచి ఆనందించాడు బోధిధర్మ డు అక్కడ కొన్ని రోజులు గడిపిన తరు వాత, షావోలిన్ ఆరామానికి చేరుకు న్నాడు. ఆ ఆరామంలోని ఒక గోడను ప్రతి రోజూ గంటల కొద్ది చూస్తూ ధ్యానం చేస్తూ తొమ్మిదేళ్ళు గడిపాడు. ప్రవచనాలు లేని ధ్యాన ప్రక్రియను కొందరు మెచ్చుకుని

ఆచరించారు, అర్హతలు నచ్చనివారు ఆయ నపై దుమ్మెత్తిపోశారు. బోధిధర్ముడు గోడ ను చూస్తూ ధ్యానం చేస్తూ గడుపుతున్న పుడు, షెన్గాంగ్ అనే భిక్షువు షావోలిన్ చేరుకుని, అతనితో ధర్మాన్ని గురించి చర్చ పెట్టుకోవాలని ప్రయ త్నించాడు. అడిగిన ప్రతిసారీ మౌనం తప్ప మాటల్లేవు. అత న్నెలాగైనా మాట్లా డించి, ధర్మాన్ని వివ రించమని అడగాలను కుని దట్టంగా మంచు కురుస్తున్న డిసెంబర్ నెలలో బోధిధర్ముడుండే గది బయట నిలబడ్డ షెన్ గాంగ్ ఆ మంచులో కూరుకుపోయాడు. తెల్లవారిన తరువాత ఆ విషయాన్ని గమనించిన బోధిధర్ముడు, 'మంచులో ఎందుకు నిలబడ్డవని అతన్ని అడిగాడు. ధర్మ ద్వారాన్ని తెరవండి. అనుకంప అందరికీ దుఃఖ నివృత్తి చేయండి' అని వేడుకున్నాడు. అంగీకరించిన  బోధిధర్ముడు షెన్ కింగ్ ని శిష్యునిగా చేర్చుకుని ధమ్మ ద్వారాన్ని తెరి  వాడు. అతనితో పాటు దోయూ, జంగి అనే వారిని కూడా శిష్యుగా చేసుకుని ధమ్మాన్ని బోధించాడు. వారితో బోధిధర్ముడు 'నా   ఎముకలను, ఎముకలు మూలుగును, మాంసాన్ని మీరు ఇప్పుడు సొంతం చేసుకున్నారు. నేనొచ్చిన పని అయిపోయింది' అంటూ తన  బీవరాలను (భిక్షు వస్త్రాలను) షెన్గాంగ్కిచ్చి, ధర్మ శకలాలు సారథ్యాన్ని కూడా అప్పజెప్పాడు  క్రీ.శ. 528లో పరినిర్వాణం చెందిన బోధిధర్మునికి  లోయాంగ్ వద్ద ఒక స్థూపాన్ని, కాంగ్ జింగ్ అనే చోట ఒక  .ఆలయాన్ని నిర్మించారు చైనీయులు. ప్రవచనాలు, సూత్రాలపై...ఆధారపడకుండా, బుద్ధి కేంద్రంగా 'తథత'ను ఆకళింపు చేసుకుని  బుద్ధత్వాన్ని పొందాలని చెప్పిన గొప్ప బౌద్ధాచార్యునిగా చైనాలో ఇప్పటికీ కొనియాడబడుతున్నాడు బోధిధర్ముడుచైనా చేరుకున్నపుడు స్వాగతించిన రాజు వూ, బోధిధర్ముని పరినిర్వాణం తర్వాత అతని గొప్పతనాన్ని కీర్తిస్తూ ఒక శాసనాన్నివేయించాడు. బోధిధర్ముని ధ్యాన పద్ధతి మొదటి ఛానెల్ గా, తలవాత జెన్గానూ గుర్తింపు పొంది చైనా, జపాన్లలో బహుళ ప్రచారంలో ఉందికంచి నుంచి బయల్దేరిన బోధిధర్ముడు, మామల్ల (మహాబలి) పురం నుంచి తొలుత శ్రీలంక చేరుకుని, రెండు నెలల తరువాత సుమత్రా, అక్కణ్ణించి చైనా చేరుకున్నాడు. ధ్యాన ప్రజల ద్వారా త్రి తగతిన బుద్ధత్వాన్ని సంతరించుకునే జెన్ బౌద్ధాన్ని అందించిన బోధి ధర్ముని మూలాలు తెలుగు నేలపైనే ఉన్నాయి. ఇక్ష్వాకుల తర్వాత, ధాన్యకటకం-దర్శి మధ్యగల ఇప్పటి పల్నాటి ప్రాంతాన్ని పాలించిన తెలుగు రాజవంశీకులు ఒకరైన పల్లవ వీరకూర్చవర్మ, ఆ తర్వాత రాజధానిని ధాన్యకటకం నుంచి కంచికి మార్చాడు. అతని తరువాత కంచి నుంచి పాలించిన రెండో సింహవర్మ మూడో కుమారుడే బోధి ధర్ముడు. చైనా నుంచి జపాన్ కి ధ్యాన (జెన్) వెలుగుల్ని మ్మిన బోధిధర్ముడు మన తెలుగువాడే   


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు